25-07-2025 12:00:00 AM
జడ్చర్ల జూలై 24 (విజయ క్రాంతి) : ఓ ప్రయాణికుడు రైచూర్ నుంచి హైదరాబాద్ ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తు మహబూ బ్ నగర్ బస్టాండ్ లో లాప్టాప్ ను మర్చిపోయిన సంఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బస్టాండ్ లో లాప్టాప్ మర్చిపోయి హైదరాబాద్ వెళుతున్న తరుణంలో మహబూబ్ న గర్ ఆర్టీసీ సిబ్బంది ల్యాప్టాప్ ను గుర్తించి ప్ర యాణికుడు కోటేశ్వరరావు వివరాలు సేకరించారు.
హైదరాబాద్ వెళ్తున్నాడు ఆ ప్ర యాణికుడని తెలుసుకొని జడ్చర్ల బస్టాండ్ కు మహబూబ్నగర్ నుంచి ల్యాప్టాప్ ను పం పించారు. ప్రయాణికుడికి జడ్చర్ల బస్టాండ్ లో లాప్టాప్ ను అందించారు. మర్చిపోయిన లాప్టాప్ తిరిగి ప్రయాణికుడు కోటేశ్వరరావు చేరడంతో ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎమ్ రవీంద్రనాథ్, శివ రాముడు, లింగంపేట నర్సింలు, తదితరులు ఉన్నారు.