calender_icon.png 14 October, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మండల పరిషత్ అధికారి

14-10-2025 05:44:12 PM

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల మున్సిపాలిటీ కేంద్రంలో ట్రైబల్ వెల్ఫేర్ బాలుర కళాశాలను ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తనిఖీ చేశారు. మంగళవారం రోజు ట్రైబల్ వెల్ఫేర్ బాలుర కళాశాల, మినీ గురుకులం పాఠశాలను ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి సందర్శించారు. అనంతరం మినీ గురుకుల విద్యార్థినిలతో కలిసి సహబంతి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపాల్ ఉమారాణి, వైస్ ప్రిన్సిపాల్ విజయశాంతి, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మైతిలి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.