calender_icon.png 19 August, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటమయ్య బస్తీలో సీసీ రోడ్లు, బురద గుంటలుగా మారిన రోడ్లు

19-08-2025 12:30:14 AM

ఆలేరు, ఆగస్టు 18 (విజయ క్రాంతి): ఆలేరు కాటమయ్య నగర్ కాలనిలో సిపిఎం పోరుబాట సందర్భంగా ఎం ఏ ఇగ్బాల్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరిగాడి రమేష్ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమస్యను  పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాటమయ్యబస్తీ ద్వారకా నగర్ కాలనీలలో సిసి రోడ్లు మురుగు కాలువల నిర్మాణం లేకపోవడం వలన గత కొంతకాలంగా పట్టణంలో కురుస్తున్న వర్షాలకు కాలనీలలోని రోడ్లు బురద గుంతలుగా ఏర్పడి కాలనీవాసులు ఇంటి నుండి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయని వారు అన్నారు

సమస్యలను పరిశీలించినప్పుడు అక్కడ ప్రాంత ప్రజలు అనేకమంది సిపిఎం బృందం దగ్గరికి వచ్చి ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు ప్రభుత్వం సైతం నిర్లక్ష్య వహిస్తున్నారని వారు వాపోయారు ఈ విషయమై సిపిఎం నాయకులు మాట్లాడుతూ గతంలో స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ ప్రాంతంలోని సమస్యలను చెప్పి చింతకింది గీతాంజలి ఇంటి నుంచి మైలారం రమేష్ ఇంటి వరకుసీసీ రోడ్ల నిర్మాణం ములుగు కాలువ నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా ఘనగాని మల్లేశం ఇంటి నుండి మోరీగాడి వెంకటేష్ ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు వెంటనే సిసి రోడ్ నిర్మాణం చేపిస్తానని హామీ ఇచ్చారని దాదాపుగా పది నెలలు గడిచిన పనులు ప్రారంభం కాకుండా ప్రజలు వర్షాకాలంలో అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు 

సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే  ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వడ్డేమాన్ బాలరాజు ఎండి మతి యాసారపు ప్రసాద్ ఎండి ఖలీల్ బర్ల సిద్దులు లక్కాకుల శీను బేతి రఘురాములు అంగిరేకుల భాగ్య రుద్రవీణ పప్పి రచ్చ రాజేష్ రచ్చ వజ్రమ్మ కటకం పుష్పమ్మ మొరిగాడి అనిత కుడుదుల భాగ్య పాల్గొన్నారు.