calender_icon.png 27 October, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు

27-10-2025 01:11:41 AM

ముత్తారంలో సీసీ కెమెరాలు ఏర్పాటులో ఎస్‌ఐ రవికుమార్

ముత్తారం, అక్టోబర్ 26 (విజయక్రాంతి) నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ము త్తారం ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. ఆదివా రం ముత్తారం మండల కేంద్రంలోని కాసర్ల గడ్డ బస్టాండ్ వద్ద దాతల సహకారంతో మూడు కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న దొంగతనాలను అరికట్టాలంటే, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే గుర్తు తెలియని వ్యక్తుల వివరాలు తెలిసేందుకు సీసీ కెమెరాలు ఎంతో తోడ్పడుతాయి అన్నారు. గ్రామాలలో ఎవరు లేని ఇంట్లో, రోడ్ పై వెళ్ళుతున్న ఆడ వారి మేడలో నుం డి బంగారపు అభరణాలు దొంగతనాలు చేస్తున్నారని, ఈ దొంగతనాలు అరికట్టాలంటే దాతల సహకారం ఎంతో అవసరమ ని, ముత్తారం గ్రామానికి చెందిన మిర్చి వ్యా పారులు మారం శ్రీను, దేవేందర్ రెడ్డి స్థానిక నాయకులు గాదం శ్రీనివాస్, రాజు ల సహకారంతో మూడు సీసీ కెమెరాలను అమర్చి నమని, మండలంలోని అన్ని గ్రామాలలో ముఖ్యమైన కూడలిలో సీసీ కెమెరాలు ఏ ర్పాటుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ప్రజల సహకారంతో మండలంలో దొంగతనాలు అరికట్టేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.