calender_icon.png 26 July, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీడీపీఓ పరీక్ష రద్దు

20-07-2024 12:05:24 AM

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ (సీడీపీఓ), ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఈవో) 23 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలను రద్దుచేస్తున్నట్లు టీజీపీఎస్సీ శుక్రవారం ప్రక టించింది. గతంలో పేపర్ లీకేజీపై నిజ నిర్ధారణ కమిటీ వేశారు. ఈ పరీక్షల ప్రశ్నపత్రాలపై సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరి (సీఎఫ్‌ఎస్‌ఎల్), స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్‌ఐటీ) నివేదికల ఆధారంగా టీజీపీఎస్సీ ఈ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.