calender_icon.png 27 July, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

20-07-2024 12:05:00 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్ధానాలు, హామీల అమలులో విఫలమైందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిరహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే సం స్థాగత ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బు ద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. సం స్థాగత ఎన్నికలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

బీజేపీలో పనిచేసే నిమ్నస్థాయి కార్యకర్త కూ డా అత్యున్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఉన్నదన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే అధికార పార్టీ బీజేపైపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఐక్యంగా, ధైర్యంగా ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చా రు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, జిల్లా నాయకులు ఆది నాథ్, వేణుగోపాల్, నగేష్, జోగు రవి, దినే ష్ మాటోలియా, అంకత్ రమేష్, బోయర్ విజయ్, మయుర్ చంద్ర, లాలా మున్నా, మానాజీ, దయాకర్ నాయకులు పాల్గొన్నారు