calender_icon.png 26 July, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి బాటలో సుధా బ్యాంక్

20-07-2024 12:05:00 AM

  • ఖాతాదారులకు మెరుగైన సేవలు 
  • సాంకేతిక రంగంలో ముందంజ

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): వాటాదారులు, ఖాతాదారులకు నిరంతరం మెరుగైన సేవలందిస్తూ సుధా బ్యాంక్ అభివృద్ధి బాటలో నడుస్తున్నదని బ్యాంక్ మేనే జింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్, చైర్మన్ మీలా మహదేవ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన సుధా బ్యాంక్ 25వ వా ర్షిక సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. 25వ వార్షికానికి అద్భుతమైన పని తీరు కనబరిచిన వాటాదారులకు 20% డివిడెండ్ ఇచ్చినట్లు తెలిపారు. 25వ వార్షిక నివేదికతోపాటు వివిధ పద్దులను ప్రవేశపెట్టి ఆమోదం పొందారు.

సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. మహిళలు కూడా బ్యాంకు ఖాతాలు తెరిచి మొబైల్ ద్వారా తమ ఖాతాల్ని తేలిగ్గా నిర్వహించుకోవాలని చెప్పారు. సమావేశంలో బ్యాంకు డైరెక్టర్లు భువనగిరి భాస్కర్, శంకర్లాల్, కక్కిరేణి చంద్రశేఖర్, ఏపూరి శ్రవణ్ కుమార్, మీలా సందీప్, వెంపటి వెంకటరమణ, వాటాదారులు గండూరి శంకర్, ఇరిగి కోటేశ్వరి, తోట శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు.