19-08-2025 12:59:44 AM
మేడిపల్లి ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా మేడిపల్లిలో సోమవారం తెలంగాణ పాపన్న పూలే ఫౌండేషన్ అధ్యక్షులు వేముల కేశవ నాదం గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో ఒక సామాన్య గౌడ కులములో జన్మించి కులవృత్తిని చేపట్టి, ప్రజానాయకుడిగా, ధైర్యవంతుడిగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన వీరుడిగా చరిత్రలో నిలిచిపోయారు.
మొఘలుల నిరంకుశ పాలనను, భూస్వాముల దౌర్జన్యాలను ధిక్కరించి, నిజాం రాజులకు ముచ్చెమటలు పట్టించిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న.ఇతని జీవితం, పోరాటం ఒక ధైర్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.పాపన్న సుమారు 30 కోటలను తన అధీనంలోకి తెచ్చుకుని,స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారని,అతను ప్రజల నుంచి పన్నులు వసూలు చేయలేదు, ధనవంతుల నుంచి తీసుకున్న ధనంతో తన సైన్యాన్ని పోషించి, ప్రజల అవసరాలను తీర్చారు. అతను ప్రజల పక్షపాతిగా, న్యాయమైన పాలకుడిగా పేరుగాంచారని అన్నారు.ఈ కార్యక్రమంలో పాపన్న పూలే ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కే వెంకటేష్ గౌడ్,శారద గౌడ్,దుర్గా, శైలజ, విజయలక్ష్మి ,పీర్జాదిగూడ అధ్యక్షులు గిరి గౌడ్ , లగ్గాని సోమేశ్, కే రంజిత్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.