27-09-2025 12:16:48 AM
అలంపూర్, సెప్టెంబర్ 26: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు.సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కుటుంబ సమేతంగా ద ర్శించుకుని అమ్మవారు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అదేవిధంగా సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ సతీ సమేతంగా ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా వారికి ఆలయ ఈవో దీప్తి అర్చకులు స్వాగతం పలికారు.అనంతరం వారికి వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరిత తిరుపతయ్య ఆలయాలను దర్శించుకుని ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అర్చకులు పాల్గొన్నారు