calender_icon.png 27 September, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకం

27-09-2025 12:15:09 AM

వనపర్తి, సెప్టెంబర్ 26 ( విజయక్రాంతి ) : ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రానున్న స్థానిక సంస్థల (గ్రామపంచాయతీ) 2025, రెండవ ఆర్డినరీ ఎన్నికల నేపథ్యంలో ఆర్వోలు, ఏఆర్‌ఓలకు స్టేజ్ 1, స్టేజ్ 2 ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటుగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని, కాబట్టి ఆర్వోలు అత్యంత జాగ్రత్తగా తమ ఎన్నికల విధులను నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కరదీపికలో ప్రతి ఒక్క పేజీని తప్పకుండా చదవి, అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం హ్యాండ్ బుక్ లో నిర్దేశించిన సూచనల మేరకే విధులను జాగ్రత్తగా నిర్వహించాలని తెలియజేశారు.

ఎన్నికల ప్రక్రియలో నామినేషన్లు, నామినేషన్లను అనుమతించడం, తిరస్కరించడం, స్క్రూట్ని ప్రక్రియలు చాలా ము ఖ్యమైనవని వివరించిన కలెక్టర్, ఇందులో ఆర్వోలు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఆర్వోలు ఎన్నికల నిర్వహణ ప్రక్రియలు ఇలాంటి తారతమ్యాలు లేకుండా, అత్యంత పార దర్శకత పాటించాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్, టి వో టి శ్రీనివాసులు, ఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.