calender_icon.png 2 October, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతజయంతి ఉత్సవాలు

02-10-2025 12:20:49 AM

  1. సుమారు 116 మంది సభ్యులు గణ వేషధారణ

బరం ఎడిగి  గ్రామంలో ఊరేగింపుగా పద సంచలనం

బాన్సువాడ అక్టోబర్ 1 (విజయ క్రాంతి): వనవాసి కల్యాణ్ దక్షిణ మధ్య సంఘటన మంతి శ్రీ శివ రామ కృష్ణ గారు విచ్చేశారు వారు తమ అమూల్య సందేశాన్ని భారత దేశ ఐక్యత గురించి మరియు సంఘం ఆవిర్భావం జరిగిన క్రమము గురించి చక్కగా వివరించారు... సంఘం 1925 వ సంవత్సరం లో స్థాపించబడింది. నేటికి విజయ వంతంగా 100 సంవత్సరములు పూర్తి అయినవని తెలిపినారు..

ప్రతి కుటుంబం సంఘం నిర్దేశించిన పంచ పరివర్తన నియమాలని అనుసరించాలని తెలిపినారు.. భారత దేశ కుటుంబ వ్యవస్థ ఐక్యత, ప్లాస్టిక్ రహిత పర్యావరణం, తీర్థ యాత్రలు సందర్శన, స్వదేశీ వస్తువులు వినియోగం, కుల రహిత సమాజ నిర్మాణం మరియు అఖండ భారత నిర్మాణం జరగాలని తెలిపారు... దేశ విపత్కర సమయాలలో సంఘం పోషించిన పాత్రను మరియు సేవా కార్యక్రమాలు జరిగిన తీరు చక్కగా వివరించారు..

సంఘం చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం బుధవారం ఉదయం వంద రూపాయల నాణెం విడుదల చేయడం జరిగిందని తెలిపారు. గురువారం నాగపూర్ నందు ఉదయం 7:40 గంటలకు సారంగ్చలక్ మోహన్ భగవత్ జీ ప్రసంగం ఉంటుందని దీనిని అందరూ వీక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు గంగాధర్ గారు,  కులకర్ణి గణేశ్ రావు పంతులు, పెద్ద మొత్తంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.