calender_icon.png 2 October, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిమ్మాపూర్‌లో తెగిపోయిన చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మతులు

02-10-2025 12:22:07 AM

  1. గోనే సంచులతో, కట్టకు దీటుగా పెట్టి, పనులు చేస్తున్నాం 

నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు 

ఎల్లారెడ్డి అక్టోబర్ 1 (విజయక్రాంతి) : నెల రోజుల క్రితం భారీగా కురిసిన కుంభవృష్టి వర్షానికి, తిమ్మాపూర్ పెద్ద చెరువు కట్ట తెగిపోయి చెరువులోని నీరు భారీగా తరలిపోవడంతో, చెరువు కట్ట కింద ఉన్న రైతుల పంట పొలాలు తీవ్రం నష్టం జరిగింది.

కొంతమేరకు ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశానుసారం తిమ్మాపూర్ చెరువు కట్టకు తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం పెద్ద చెరువులో కొద్ది మేరకు నీరు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పంటకు అవసరమున్న కొంతమంది రైతులకు నిరు అందుతుందని ఆయన తెలిపారు