09-08-2025 02:19:16 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సోరాబ్జీ పోచ్ఖానావాలా 144వ జయంతి సందర్భంగా శుక్రవారం బెంగళూరు ప్రాంతీయ కార్యాలయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంవి మురళీ కృష్ణ, జోనల్ హెడ్ ధరసింగ్ నాయక్ కె, రీజినల్ హెడ్ కె. పార్ధ సారథి నాయుడు హాజరయ్యారు. 1911లో బ్యాంకును స్థాపించిన పోచ్ఖానావాలా భారతీయ బ్యాంకింగ్‌లో మార్గదర్శకుడు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిగా భారతీయుల యాజమాన్యంలో, నిర్వహణలో ఉన్న మొదటి భారతీయ వాణిజ్య బ్యాంకు. ఇది దేశ ఆర్థిక చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇటీవలి కార్యక్రమాలలో మెరుగైన డిజిటల్ ప్లాట్‌పామ్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో చేరువ కావడం, ఎస్‌ఎంఈలు మరియు వ్యవసాయం మరియు రంగాలకు మద్దతు, గ్రీన్ బ్యాంకింగ్ పద్ధతులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 4,500 కంటే ఎక్కువ శాఖలతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నమ్మకం, పారదర్శకతతో దేశానికి సేవ చేయడానికి అంకితభావంతో ఉన్నదని యు. యతీంద్ర, చీఫ్ మేనేజర్, జోనల్ ఆఫీస్ తెలిపారు.