09-08-2025 02:20:39 AM
రోగులకు అందుబాటులో డే కేర్ సేవలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): భారీవర్షాల నేపథ్యంలో జంటనగరాల్లో మళ్లీ జ్వరాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే జ్వరబాధితులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఫీవర్ క్లినిక్ అనే డే కేర్ సెంటర్‌ణు ఎస్‌ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ ఎస్‌వి రాఘవేంద్రరావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి శ్రీనాథ్‌రెడ్డి గురువారం ప్రారంభించారు.
వర్షాల కారణంగా జ్వరాలు ఉధృతం అవుతున్నాయని, అందువల్ల జ్వరం వచ్చినవారు వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్సలు పొందేందుకు ఇలాంటి ప్రత్యేక ఫీవర్ క్లినిక్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ క్లస్టర్ సీఈఓ డాక్టర్ హరికుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. “రోగులకు తగిన చికిత్సలు అందుబాటు ధరల్లో అందించేందుకే ఈ ఫీవర్ క్లినిక్‌ను ప్రారంభించాం. ఇక్కడ నాణ్యమైన వైద్య సేవలు, అన్నిరకాల వైద్య పరీక్షలు, 24 గంటలూ అనుభవజ్ఞులైన వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటారు” అని చెప్పారు.