11-10-2025 07:13:19 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): సాదాబైనామ దరఖాస్తుల్లో తప్పులు దొర్లకుండ పకడ్బందిగా పరిశీలించాలని ఘట్ కేసర్ తహసీల్దార్ డీఎస్ రజిని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఘట్ కేసర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 2020లో దరఖాస్తు చేసుకున్న 107 దరఖాస్తులను ఆమె శనివారం పరిశీలించారు. ఇటీవల హైకోర్టు సాదాబైనామాపై స్టే కొట్టివేడయంతో ఈ ప్రక్రియను రెవెన్యూ అధికారులు వేగవంతం చేపట్టారు. మండలంలో దరఖాస్తు చేసుకున్న 107 మందికి నోటీసులు జారీ చేశారు.
సాదాబైనామా పేపర్ తో పాటు అమ్మినవారి, కొనుగోలు చేసిన వారి ఆధార్ కార్డులను పరిశీలించి అమ్మిన వారి నుంచి సమ్మతి(కన్సెంట్) పత్రాని తీసుకున్నారు. మండలంలో సాదాబైనామాపై ఎక్కువగా అంకుశాపూర్ లో 42, అవుషాపూర్ 22, ఎదులాబాద్ లో 20, కొర్రెములలో 34, ప్రతాప్ సింగారంలో 26 దరఖాస్తులు అందినట్లు తహసీల్దారు తెలిపారు. ఈ కార్యక్రమలో డిప్యూటీ తహసీల్దార్ రాజేందర్, జీపీవోలు తదితరులు పాల్గొన్నారు.