30-04-2025 12:00:00 AM
రేవల్లి : ఏప్రిల్ 29: మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామశివారులోని హజారేచెరును కేంద్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ బృందం పరిశీలించారు,2020సంవత్సరం లో జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా హజార చెరువు ఎంపికైనది ఇందులో భాగంగ ఉపాధి హామీ కూలీలతో 780364.47 నిధులను వెచ్చించి 4122 క్యూబిక్ మీటర్ల ఒండ్రుమట్టిని రైతుల పొలాలకు తరలించగా వాటి ప్రయోజనాలను మంగళవారం కేంద్ర జలశక్తి అభియాన్ శాఖ శాస్త్రవేత్త అయిన డాక్టర్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలోని ముగ్గురు అధికారుల బృందం స్థానిక ఎంపీడీవో విజయ్ కుమార్ తో కలిసి హజారే చెరువును పరిశీలించి పంట పొలాలకు వాటి ప్రయోజనాలను పరిశీలించారు, ఈ కార్యక్రమంలో మండల ఉపాధి హామీ అధికారి నరసింహ,గ్రామ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు