27-08-2025 02:43:40 AM
కామినేని ఆస్పత్రి వైద్యుల సూచనలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 26 (విజయక్రాంతి): వానాకాలంలో సీజనల్ జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కామి నేని ఆస్పత్రి వైద్యులు సూచించారు. కామినేని ఆస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎం స్వామి, మరో సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ హరికిషన్, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్లు డాక్టర్ శ్రీకృష్ణ రాఘేవంద్ర బొడ్డు, డాక్టర్ ప్రదీప్ కుమార్ పటేల్‌లతో కలిసి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. “వర్షాలు వస్తూ, తగ్గు తూ ఉన్న ఈ తరుణంలో పలు రకాల జ్వరా లు ఎక్కువవుతున్నాయి.
డెంగ్యూలో మా మూలుగా అయితే చేతులు, కాళ్ల నొప్పులు, ప్లేట్‌లెట్లు పడిపోవడం లాంటివి ఉంటాయి. కానీ, ఈ సీజన్‌లో వస్తున్నవాటిలో ముందు గా విరేచనాలు అవుతున్నాయి. ఒకటి రెండురోజుల తర్వాత జ్వరం వచ్చి అప్పుడు ప్లేట్ లెట్లు పడిపోవడం లాంటివి కనిపిస్తున్నాయి. వారానికి కనీసం ఐదు కేసుల వరకు ఒక్క కామినేని ఆస్పత్రికే వస్తున్నాయి. అలాగే చికన్ గున్యా కేసులూ విజృంభిస్తున్నాయి” అని చెప్పారు.
ఎలాంటి జ్వరం లేకముందే ఫ్లూ టీకాలు గానీ, క్వాడ్రలెంట్ టీకాలు (నాలుగు రకాల వైరస్‌లపై పోరాడేవి) గానీ తీసుకోవాలి అని సూచించారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏడాది వరకు మళ్లీ టీకా తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ఇళ్లలోను, కార్యాలయాల్లోను ఎయి ర్ ఫిల్టర్లు అమర్చుకోవడం మంచిదని చెప్పా రు. ఈ సీజన్‌లో వచ్చే జ్వరాలకు మాత్రం వీలైనంత వరకు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అప్పుడు లక్షణాలు చూసి, అవసరమైన రక్తపరీక్షలు చేయించి వాటికి తగిన మందులు ఇవ్వడానికి వీలుంటుందని పేర్కొన్నారు.