27-09-2025 01:31:45 AM
-11వేలు తీసుకుంటూ పట్టుబడిన జూనియర్ లైన్‌మెన్
మేడ్చల్, సెప్టెంబర్ 26(విజయ క్రాంతి): లంచం తీసుకుంటూ మరొక విద్యుత్ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కూకట్‌పల్లి వసంత నగర్ సెక్షన్ లో జూనియర్ లైన్‌మెన్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ గౌడ్ ఒక వినియోగదారుడు నుంచి 11వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక వినియోగదారుడి ఇంటి వైరును 5కేవీ నుంచి 11 కేవీకి మార్చేందుకు 30 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. 11 వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. ఆ డబ్బును శుక్రవారం జూనియర్ లైన్‌మెన్ శ్రీకాంత్ గౌడ్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.