calender_icon.png 27 September, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టింది కాంగ్రెస్ లోనే.. కట్టే కాలేంతవరకు కాంగ్రెస్ లోనే ఉంటా

26-09-2025 11:14:28 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): పుట్టింది కాంగ్రెస్ లోనే, కట్టే కాలేoత వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని బాండ్ పేపర్ పై రాసిస్తానని ఎమ్మెల్సీ బల్మారి వెంకట్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపుపై ఆయన స్పందిస్తూ.. తనది విశాల హృదయమని అన్నారు. తొలగించిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు.

ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడమే తన ప్రథమ ద్యేయమని,స్థానిక నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని అన్నారు. వారిపై చర్యలు ఉంటాయని అన్నారు. ఆయనను కలిసేందుకు వచ్చే స్థానిక నాయకుల పదవులు పోతాయనే అపోహలు పెట్టుకోవద్దని, ఇవన్నింటిపై పోరాటాలకు సైతం సిద్ధమని ఆయన ప్రత్యర్థులను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవని, తమ ప్రథమ ధ్యేయం స్థానిక సమస్యలపై పోరాటం చేయడమేనని అన్నారు.