26-09-2025 11:17:50 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): నేటి యువత ఉద్యోగాల వేట మాని వ్యాపార రంగం వైపు దృష్టి మరల్చాలని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ ఎన్ఎఫ్సీ నగర్ లో మాజీ సర్పంచ్ మేడ బోయిన వెంకటేష్ ముదిరాజ్ ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజక వర్గం కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బేకరీ ని ప్రారంభించారు.