calender_icon.png 27 September, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సులు ఎక్కి బహుమతి గెలుచుకోండి: డిఎం పండరి

26-09-2025 11:08:50 PM

నిర్మల్,(విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో దసరాకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందించేందుకు నిర్ణయించినందున బస్సులెక్కి బహుమతి పొందాలని నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. దసరాకు లక్కీ డ్రా నిర్వహణ రూ.5.50 లక్షల విలువగల బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. దసరా పండగ నేపథ్యంలో సెమీ డిలక్స్, సూపర్ లగ్జరి, రాజధాని ఏసీ ప్రయాణించే ప్రయాణికుల కొరకు లక్కీ డ్రా నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్ కు ముగ్గురి చొప్పున 33 మందికి  రూ.5.50 లక్షల విలువ గల బహుమతులు సంస్థ అందచేయనున్నది. ఒక్కో రీజియన్ కు ప్రథమ బహుమతి రూ.25 వేలు ద్వితీయ బహుమతి రూ.15 వేలు తృతీయ బహుమతి రూ.10 వేలు అందచేస్తున్నట్లు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు.

ఈ నెల 27 నుండి అక్టోబర్ 6 వరకు డిలక్స్, సెమీ డిలక్స్, సూపర్ లగ్జరి, లహరి నాన్ ఏసీ అన్ని రకాల ఏసీ బస్సులలో ప్రయాణించి మీరు దిగిన చోటే ప్రయాణ ప్రాంగణంలో డ్రా బాక్స్ ఉంటుంది. మీరు తీసుకున్న టికెట్ వెనకాల మీ పేరు, పోన్ నంబర్ వ్రాసి డ్రా బాక్స్ లో వేయండి. లక్కీ డ్రా అనంతరం అక్టోబర్ 8వ తేదీన రీజియన్ కార్యాలయంలో రీజినల్ మేనేజర్ చేతుల మీదుగా  ముగ్గురి చొప్పున విజేతలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందచేసి సంస్థ డ్రాలో  గెలుపొందిన వారికి ఘనంగా సన్మానిస్తుందని డిపోమేనేజర్ కే పండరి తెలిపారు. ప్రయాణికులు ఈ సదావకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన తెలిపారు.