03-11-2025 07:44:26 PM
నకిరేకల్,(విజయక్రాంతి): ఈ నెల 8న జరిగే చండ్ర పుల్లారెడ్డి సంస్మరణ సభను విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్, అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి కోరారు. సోమవారం నకిరేకల్ పట్టణంలోని యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సభకు విప్లవ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు మామిడోజు వెంకటేశ్వర్లు, అంబటి నర్సయ్య, పిట్టల అనిల్ పాల్గొన్నారు.