calender_icon.png 17 September, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన చిటికెల గోవింద్

17-09-2025 02:31:49 AM

ముషీరాబాద్, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆర్.  కృష్ణయ్య నేతృతంలో బిజెపిలో చేరానని జాతీయ బీసీ యువజన సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చిటికెల గోవిం ద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు విశాఖపట్నం వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఆర్ కృష్ణ య్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సమక్షంలో గోవింద్ బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కం డువా కప్పి బిజెపిలోకి నడ్డా ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి బలోపేతం కోసం చేయవలసిన కార్యక్రమాలపై దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ పటేల్, అరవింద్ స్వామి ఉన్నారు.