04-05-2025 01:06:23 AM
శ్రీలంక విమానంలో లష్కర్ ఉగ్రవాదులు ఉన్నట్టు చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు మెయిల్
కొలంబోలో తనిఖీలు చేపట్టిన సిబ్బంది
కొలంబో, మే 3: చెన్నై శ్రీలంకకు వెళ్లిన శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఎల్122 విమానాన్ని కొలంబోలోని బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తనిఖీ చేశారు. చెన్నై శ్రీలంక విమానంలో లష్కర్ ఉగ్రవాదులు ఉన్నట్టు చెన్నై విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ రావడంతో కొలంబోలో అధికారులు తనిఖీలు జరిపారు.
అందులో ఉన్న లష్కర్ ఉగ్రవాదులకు పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉండొచ్చనే అనుమా నంతో ఈ తనిఖీలు నిర్వహించారు. కానీ విమానంలో ఎటువంటి అనుమానిత వ్యక్తు లు లేరని శ్రీలంక పోలీసులు ప్రకటించారు. శ్రీలంక పోలీసులు, శ్రీలంక ఎయిర్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పహ ల్గాం ఉగ్రఘటన అనంతరం భారత్ భద్రతను కట్టుదిట్టం చేసింది. బెదిరింపు మెయిల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు వచ్చింది.