calender_icon.png 5 May, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌లోకి ప్రవేశించిన పాక్ రేంజర్

04-05-2025 01:08:31 AM

పట్టుకున్న బీఎస్‌ఎఫ్ సిబ్బంది

జైపూర్, మే 3: భారత సరిహద్దులోకి చొరబడిన ఓ పాక్ రేంజర్‌ను శనివారం బీఎస్‌ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ సమీపంలో ఉన్న సరిహద్దులోకి ఓ పాక్ సైనికుడు ప్రవేశించాడు. అతడు సరిహద్దు వద్ద అనుమా నాస్పదంగా తిరుగుతుండటంతో బీఎస్‌ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.

పహల్గాం ఉగ్రదాడి అనంతరం బీఎస్‌ఎఫ్ సిబ్బంది అత్యంత అప్రపత్తతో ఉన్నారు. ఇటీవల ఓ బీఎస్‌ఎఫ్ జవాను పొరపాటున భారత సరిహద్దు దాటి పాక్‌లోకి ప్రవేశించగా.. పాక్ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకుని అప్పగించకుండా సాకులు చెబుతున్నారు.