02-05-2025 01:12:32 AM
ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎన్జీవో కాలనీలో గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన
ఎల్బీనగర్, మే 1: గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని, ప్రజలు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోని ఎన్జీవో కాలనీలో లైబ్రరీ గ్రౌండ్ లో నూతన గ్రంధాలయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 1.95 కోట్లు మంజూరు చేయించారు. ఈ క్రమంలో నిర్మాణ పనులు ఆలస్యమ య్యాయి. ఈ స్థలంలో అన్ని భవనాలు ఒకటే చోట ఉండేలా జీ ప్లస్ 4 భవనాన్ని నిర్మించాలని సుధీర్ రెడ్డి ప్రతిపాదించారు. ఎట్టకేలకు లైబ్రరీ భవనం నిర్మాణ డిజైన్స్ పూర్తి కావడంతో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
ఈ మేరకు గురువారం లైబ్రరీ భవనం నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, కార్పొరేటర్లు లచ్చిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, బీఆర్‌ఎస్ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, వివిధ కాలనీ సంఘాల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.