02-12-2025 01:56:48 AM
హనుమకొండ ఘటన
మహబూబాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): హనుమకొండ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థినిపై కెమికల్ దాడి జరిగింది. సోమవారం కాజీపేట సమీపంలోని కడిపికొండ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతిపై గుర్తుతెలియని యువకులు కెమికల్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
జనగామ జిల్లాకు చెందిన బాధిత యువతి హనుమకొండలోని నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. సోమవారం సాయంత్రం సమీప బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.