02-12-2025 01:52:43 AM
-రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యం..
-విద్యార్థుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి..
-మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ
ముషీరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాం తి): జీవో 9 ఉండగానే జీవో 46ను తీసుకువచ్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మా జీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్న ఫీజు లో బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నారాయణగూడ చౌరస్తాలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణలు మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఫీజులు కడితేనే గ్రేస్ మార్కులు వేస్తామని కాలేజీ యాజ మాన్యాలు విద్యార్థులు వేదిస్తున్నారని వారు మండిపడ్డారు.
విద్యకు విద్యార్థులు దూరమవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చి తప్పారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలను మోసం చేశారన్నారు. జీవో 46 అమలు చేయడం తీవ్ర అన్యాయమని, స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 12,735 గ్రామపంచాయతీలో కేవలం 2176 బీసీల రిజర్వేషన్లు కల్పించారని మండిపడ్డారు.బీసీలపై ఏమాత్రం చిత్త శుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే రాబోయే పార్లమెంట్ సమావేశాలు స్తంభింపచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, మోహన్, వేణు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.