17-11-2025 12:00:00 AM
-అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే దంపతులు
-పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ సభ్యులు
కుమ్రం భీం, నవంబర్ 16(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని కంకలమ్మ గుట్టపై కొలువైన స్వయంభూ శ్రీ కంకలమ్మ- కేతేశ్వర ఆలయంలో ఆదివారం నిర్వహించిన కంకలమ్మ జాతరకు జనం భారీగా పోటెత్తారు. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు కంకలమ్మ గుట్ట, కౌటాల ప్రాం తం అంతా జనసంద్రంగా మారిం .
అమ్మవారి దర్శనానికి గంటల తరబడి భక్తులు క్యూలైన్లలో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి టిటిడి రాష్ట్ర కమిటీ సభ్యుడు రామనాథం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మ ప్రచారకర్త గొల్లపల్లి సత్యనారాయణ, నోముల చంద్రశేఖర్ లు అమ్మ వారిని పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారిని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే దంపతులు, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శివసత్తులు విన్యాసాలతో గుట్టపైకి బోనాలతో వెల్లి అమ్మవారికి బోనాలు సమర్పిం చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులు తమ కోరికలు. తీరాలని అల్లుబండను మోచేతితో లేపి కోరికలు కోరుకు న్నారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ సత్యనారాయణ స్వామి వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి మొక్కులు ఉన్న వారు గుట్ట కింద గల పోచమ్మ ఆలయం వద్ద మేకలు, కోళ్లు కోసుకుని వంటలు చేసుకున్నారు.
ఆలయ కమిటీ చైర్మన్ సులువ కనకయ్య ఆధ్వర్యంలో జాతరకు వచ్చిన వారికి తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చిన భక్తులతో కౌటాల కంకలమ్మ గుట్ట ప్రాంతం, కౌటాల మండల కేంద్రం మొత్తం జనసంద్రంగా మారింది. జాతర రోడ్డులో ఏర్పాటు చేసిన దుకాణాలలో వస్తువులను కొనుగోలు చేసేందుకు భారీగా జనాలు పోటీపడ్డారు.
అమ్మవారిని దర్శించుకున్న వారిలో తహసీల్దార్ ఉప్పుల ప్రమోద్ కుమార్ తో పాటు పలువురు అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.