calender_icon.png 29 October, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొలకెత్తని సబ్సిడీ విత్తనం

29-10-2025 12:00:00 AM

  1. నకిలీ విత్తనాలతో రైతులకు తీరని నష్టం

ప్రభుత్వం అందించిన సబ్సిడీ విత్తనాలపై నంగునూరు మండలంలో ఆరోపణలు 

నంగునూరు, అక్టోబర్ 28: రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే నకిలీ విత్తనాలు పంపిణీ చేసి నట్టేట ముంచిందని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ ఆహార భద్రత పథకం (ఎన్ ఎఫ్‌ఎస్‌ఎం) కింద ప్రభుత్వం అందించిన నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్ సి) సం స్థకు చెందిన సిఈటి 4260 మోడల్ మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తకపోవడంతో సుమారు 20 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు.నంగునూరు మండలంలో 27 మం ది రైతులు ఇవే విత్తనాలు దాదాపు 38 ఎకరాల సాగు చేశారు.

రైతులు బయట మార్కె ట్ నుండి కొనుగోలు చేసిన ఇతర కంపెనీల విత్తనాలు మొలకెత్తినా, ప్రభుత్వపరంగా సబ్సిడీపై ఇచ్చిన విత్తనాలు మాత్రం ఒక్కటి కూడా మొలకెత్తకపోవడం వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తోం ది. సబ్సిడీపై నమ్మకంతో విత్తనం వేస్తే, పది రోజులు గడిచినా మొలక రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

రసీదు లేకుండానే విత్తనాల పంపిణీ

నకిలీ విత్తనాలకు మోసపోకుండా ఉండాలంటే బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని రై తులకు పదే పదే సూచించే వ్యవసాయ అధికారులే సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసేట ప్పుడు రైతులకు ఎలాంటి రసీదూ ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నకిలీ విత్తనాలకు ఆధారంగా ఉండే రసీదునే అధికారులు ఇవ్వకపోవడంతో, నష్టపోతే ఎవరిని అడగాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్య గురించి అడగగా ‘వచ్చి చూ స్తాం‘ అని చెప్పి ఏఈఓలు వచ్చి చూసి వెళ్లిపోయారని, ఎలాంటి హామీ ఇవ్వలేదని రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు

ఎకరాకు రూ. 25వేలు నష్టపరిహారం డిమాండ్

నకిలీ విత్తనాల కారణంగా రైతులకు న ష్టం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, విలువైన సమయం వృధా కావడం, పంట ఆల స్యం అవ్వడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఒక ఎకరానికి విత్తనాలు, దున్న కం, కూలీల ఖర్చుతో సహా దాదాపు రూ.13వేల 500 ఖర్చు అయిందని, మళ్లీ వి త్తనాలు వేయాలంటే అంతే ఖర్చు అవుతుందని, మొత్తం రూ.26వేల నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు.

తమ పెట్టుబడి ఖర్చుతో పాటు, నష్టాన్ని పరిగణలోకి తీసుకుని ఎకరానికి రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విత్తనాల పంపిణీలో జరిగిన అక్రమాలపై వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, పూర్తి నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో, వ్యవసాయ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, రైతు ఉద్యమాలు చేస్తామని రైతులు హెచ్చరించారు.

 ప్రభుత్వ సంస్థ ద్వారా పంపిణీ చేసిన విత్తనాల్లోనే ఇలాంటి లోపా లు బయటపడడంపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకొని, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఎకరానికి రూ.13వేల నష్టం

‘ఒక ఎకరానికి దాదాపు రూ.13వేల 500 ఖర్చు చే శాను. విత్తనా లు మొలకెట్టకపోవడం తీవ్ర నష్టం కలిగించింది. మళ్లీ విత్తనాలు వేయడానికి ఆలస్యం అవుతుంది. వ్యవసాయ అధికారులు మా బాధను పట్టిం చుకోవడం లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నా రు. ఏఈవో వచ్చి చూసినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

కర్రె సంపతి, రైతు, గట్లమల్యాల

సబ్సిడీ విత్తనాలు మొలవలేదు

రెండు ఎకరాలకు నాలుగు ప్యాకెట్ల విత్తనాలు తీసుకు న్నాను. పది రో జులు గడిచినా మొలవలేదు. పక్కన రైతు వేరే కంపెనీ విత్తనం వేస్తే మొలకెత్తింది. ప్రభుత్వమే ఇలా నకిలీ విత్తనాలు పంపిణీ చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు.

మంగళరపు సత్తయ్య, రైతు గట్లమల్యాల