17-01-2026 12:00:00 AM
మునుగోడు, జనవరి 16 (విజయక్రాంతి): జిల్లా యువజన క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం ముఖ్యమంత్రి కప్ క్రీడా జ్యోతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికి మాట్లాడారు.యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలు శారీరక, మానసికొల్లాసానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ నేలపట్ల నరేష్ , నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, మునుగోడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీమనపల్లి సైదులు, జితేందర్ రెడ్డి మండల, పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పలు గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.