calender_icon.png 17 January, 2026 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతుల ప్రదానం

17-01-2026 12:00:00 AM

చిట్యాల, జనవరి 16(విజయ క్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు శివనేని గూడెంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు శుక్రవారం బహుమతులను ప్రదానం చేశారు. బిజెపి పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్, రాష్ట్ర నాయకుడు రుద్రవరం లింగస్వామిల ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పుడమి సాహితి వేదిక అధ్యక్షులు చిలుముల బాల్రెడ్డి పాల్గొని విజేతలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కన్నెబోయిన శ్రీధర్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ రుద్రవరం స్వామి, చొప్పరి మల్లయ్య, రుద్రవరం దశరథ, రుద్రవరం సునీల్, కుమార్ రుద్రవరం నరేష్, సహదేవ్, ఎడ్ల మాలింగం, వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కాశిరాం, మధు వంశీ, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.