calender_icon.png 2 January, 2026 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి ఖోఖో పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

02-01-2026 12:00:00 AM

హనుమకొండ,జనవరి 1 (విజయ క్రాంతి): కాజీపేట రైల్వే స్టేడియంలో జనవరి 11 నుండి 15 వరకు నిర్వహించే జాతీయస్థాయి 58 వ సీనియర్ ఖోఖో పోటీలకు సంబంధించి పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖోఖో సంఘం ప్రధాన కార్యద ర్శి నాతి కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి తోట శ్యాంప్రసాద్,మరియు కార్యవర్గ సభ్యులు సదానందం,యమ్.రమణ,వీ.స్వప్న,రాజారపు రమేష్,గుండాల అనిల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.