02-01-2026 12:00:00 AM
సొంత నిధులతో బోరు వేయించిన మల్లేష్ ముదిరాజ్
జిన్నారం(అమీన్పూర్), జనవరి 1: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి పునర్ నిర్మా ణం పనులు మొదలయ్యాయి. గురువారం పెండల మల్లేష్ ముదిరాజ్ సహకారంతో పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో నూతన బోరు వేయించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో అమ్మవారి దేవాలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లేష్, రామకృష్ణ, లింగం, నరసింహ, కుమార్, వెంకటేష్, ఆంజనేయులు, దేవేందర్ పాల్గొన్నారు.