calender_icon.png 2 January, 2026 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి ఎకనామిక్స్ అసోసియేషన్‌లో కేయూ ఆచార్య సురేష్ లాల్

02-01-2026 12:00:00 AM

కాకతీయ యూనివర్సిటీ, జనవరి 1 (విజయక్రాంతి): ప్రతిష్టాత్మక ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ జాతీయ స్థాయి జాయింట్ సెక్రెటరీ గా ఆచార్య సురేష్ లాల్ కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగాధిపతి పాలకమండలి సభ్యులు ఆచార్య సురేష్ లాల్ తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీలో డిసెంబర్ 27 నుండి 29 వరకు జరిగిన ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ 108వ వార్షికోత్సవ సమావేశంలో జాతీయస్థాయిలో జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది.

ఫూలే ఆశయ సాధన సమితి (పాస్ ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఈ పదవి పొందిన మొదటి వ్యక్తిగా ఆచార్య సురేష్ లాల్ నియామకం గర్వకారణమని జర్నలిజం, ఎడ్యుకేషన్ విభాగ అధ్యాపకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆచార్య సురేష్ లాల్ మాట్లాడుతూ 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఈ అసోసియేషన్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆచార్య అమర్త్య కుమార్ సేన్, రంగరాజన్ వంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. వికసిక్ భారత్ 2047 లక్ష్యాలను సాధించేందుకు ఆర్థిక వ్యవస్థ లో పాలసీలను రూపొందించడానికి ఈ అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా కళాశాల ప్రిన్సిపాల్ డా. నల్లాని శ్రీనివాస్, డా. బ్రహ్మం డా. వంగాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.