calender_icon.png 1 October, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహబంధంలోకి చిన్నారి పెళ్లికూతురు

01-10-2025 12:18:29 AM

‘చిన్నారి పెళ్లికూతురు’ అవికా గోర్ నిజ జీవితంలో పెళ్లికూతురిగా మారి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. హీరోయిన్ అవికా గోర్ ఆరేళ్లుగా మిలింద్ చాంద్వాని అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది. చాలా రోజుల క్రితమే ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా బహిర్గతం చేసిన అవిక గత జూన్‌లో తన ప్రియుడు మిలింద్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ జంట మంగళవారం వివాహబంధంతో ఒక్కటయ్యారు.

ముంబైలో జరిగిన ఈ వేడుకకు సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న అవికా ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. తెలుగు, కన్నడ, హిందీల్లోనూ పలు సినిమాలు, సిరీస్‌లలో నటించింది. ప్రస్తుతం నటిగా కొనసాగుతూనే నిర్మాతగానూ సినిమాలు రూపొందిస్తోంది.