calender_icon.png 1 October, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సస్పెన్స్ థ్రిల్లర్ ఆర్యన్

01-10-2025 12:20:12 AM

34 నెలల విరామం తర్వాత, విష్ణువిశాల్ సో లో లీడ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘ఆర్యన్’. శుభ్ర, ఆర్యన్ రమేశ్‌తో కలిసి విష్ణువిశాల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కే దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాష ల్లో విడుదల కానుంది. డార్క్ అండ్ సస్పెన్స్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల ర్‌గా రూపొందిన ఈ మూవీ టీజర్‌ను మేక ర్స్ మంగళవారం విడుదల చేశారు.

ఈ టీజర్.. ఒక థ్రిల్లింగ్ హత్య దర్యాప్తు, విష్ణువిశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్‌లోకి తీసుకెళ్లింది. ‘రాట్ససన్’ విజయం తర్వాత, విష్ణువిశాల్ మరోసారి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు.

సెల్వరాఘవన్, శ్రద్ధాశ్రీనాథ్, మానస చౌదరి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సాయిరోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్ అభిషేక్ జోసెఫ్ జార్జ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సం గీతం: జిబ్రాన్; డీవోపీ: హరీశ్ కన్నన్; స్టంట్స్: స్టంట్ సిల్వా, పీసీ స్టంట్స్ ప్రభు; ఎడిటర్: శాన్ లోకేశ్.