calender_icon.png 1 October, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిప్పుకు తిరిగే వయ్యారి..

01-10-2025 12:16:16 AM

తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7పీఎం, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అశ్మితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.

నవంబర్ 7న సినిమా విడుదల కానున్న ఈ సినిమా నుంచి ప్రేమగీతం ‘వయ్యారి వయ్యారి’ని విడుదల చేశారు. ‘వయ్యారి వయ్యారి.. తిప్పుకు తిరిగే ఓ నారీ.. నీ వెనకే నా మనసే పడిపోయె జారి.. సింగారి సింగారి ఒంటరి మదిలోకే దూరి.. నా ప్రాణం మొత్తాన్ని చేశావే చోరీ..’ అంటూ సాగుతోందీ పాట.

సురేశ్ బొబ్బిలి సమకూర్చిన బాణీకి సనారే సాహిత్యం అందించగా యశ్వంత్ నాగ్, సింధూజ శ్రీనివాసన్ ఆలపించారు. ఈ పాటలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్‌ట్రాక్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: కే సోమశేఖర్; ఎడిటర్: నరేశ్ అడుప; ప్రొడక్షన్ డిజైన్‌న: ఫణితేజ మూసి.