17-09-2025 02:31:26 AM
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 26న నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): బాలల హక్కులను పరిరక్షించేందుకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ 2024 సెప్టెంబర్ 26న చైల్డ్- ఫ్రెండ్లీ న్యాయ సేవల పథకాన్ని ప్రారంభించిందని నందిగామ నరేందర్ (ఎంఏ, ఎల్‌ఎల్‌బీ, రంగారెడ్డి జిల్లా, ఎల్‌బీ నగర్) చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “న్యాయ సేవల రంగంలో ఇది కీలక ముందడుగు.
బాలలకు సులభమైన, స్నేహపూర్వక న్యాయ సేవలను అందించేందుకు రూపొందించబడిన ఈ పథకం ద్వారా, సంరక్షణ అవసరమున్న పిల్లలు, చట్టంతో విరు ద్ధంగా వ్యవహరించిన పిల్లలకు, వేధింపులు, నిర్లక్ష్యం చేయబడిన పిల్లలకు ప్రత్యేక న్యాయ సహాయం అందించబడుతుంది. ఇవి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.
ఈ విభాగం ద్వారా పిల్లలకు న్యాయ సహాయం అందించడం, న్యాయ పరిరక్షణ అవసరమున్న పిల్లలకు ఉచిత సేవలు అందించడం, పోక్సో చట్టం కింద కేసులు ఎదుర్కొంటున్న బాలలకు న్యాయ సహాయం, ఫిర్యాదు నమో దు, పరిహారం కోరుతూ దరఖాస్తు, రక్షణ ఉత్తర్వులు వంటి సేవలు అం దించబడతాయి. రంగారెడ్డి జిల్లాలో బాలల న్యాయ సేవల విభాగం సభ్యుడుగా న్యా యవాది సిహెచ్ రవి సేవలందిస్తున్నారు.
దాంతో పాటు డిప్యూటీ చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకాలను అనుసరించి క్రమం తప్పకుండా ప్రభుత్వ బాల బాలికల హాస్టళ్లను, జ్యోతిబాఫూలే బిసి సంక్షేమ గురుకుల పాఠశాలలను సందర్శించి బాల బాలికలకు చట్టంపై అవగాహన కార్యక్రమా లు నిర్వహిస్తున్నారు.
బాలల న్యాయ సేవల విభాగం పిల్లల సంక్షేమ కమిటీ, జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, ఆశావర్కర్లు, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తుంది. పిల్లలకు ప్రత్యేక అవసరాలు, అభివృద్ధి చెందుతు న్న సామర్థ్యాలు ఉంటాయి. బాలల న్యాయ సేవల విభాగం సురక్షితమైన, సమానమైన, శక్తివంతమైన న్యాయ వాతావరణం కల్పించేం దుకు కృషి చేస్తోందన్నారు.