calender_icon.png 9 July, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల సంరక్షణ మన అందరి బాధ్యత

09-07-2025 12:44:10 AM

- కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

- జిల్లా బాలల సంరక్షణ యూనిట్ సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జూలై 8 ( విజయక్రాంతి); జిల్లాలో బాల కార్మికులను పరిరక్షిం చి, బాల కార్మికుల రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గా నిలపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశిం చారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం లో జిల్లా బాలల సంరక్షణ యూనిట్ సమావేశాన్ని ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జి ల్లాలో బాల కార్మిక రహిత జిల్లాగా ఉండాల ని, మారుమూల ప్రాంతాల ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని కోళ్ల ఫామ్స్,ఇటుక బట్టీ లు, షాపింగ్ మాల్ లో తదితర అన్నిచోట్ల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. మణుగూరులో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ గృ హం జిల్లా కేంద్రంకి దూరంగా ఉండటం వలన పర్యవేక్షించడానికి అనువుగా లేదని, జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలో బాలల సం రక్షణ గృహం ఏర్పాటుకు ప్రణాళికల రూ పొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మణుగూరు లో ఉన్న బాలల సంరక్షణ గృహమును సిడిపిఓ కార్యాలయంగా మార్చాలని అధికారులను ఆదేశిం చారు.

జిల్లాలోని బాలల సంరక్షణ గృహం లో పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని, సంరక్షణ గృహాలలో నెలకొన్న సమస్య లు వాటి పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై వారంలోగా సమగ్ర నివేదిక అందించా లని వెంటనే సమస్యలు పరిష్కరిస్తామన్నా రు. జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించారు. జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థినిల హాజరు పర్యవేక్షించాలని ఎవరైతే పది రోజుల కంటే ఎక్కువ సెలవులు ఉ న్నాయో అట్టి విద్యార్థినిలను ఆరోగ్య సమ స్య లేదా వివాహం ఏమైనా జరిగిందా అని విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు.

అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేసి పిల్లల సంరక్షణ చేపట్టాలని, పిల్లల సంరక్షణ మన అందరి బాధ్యత అని ఆయన అన్నారు.జిల్లాలో ఎన్ని పోక్సో కేసులు నమోదయ్యాయి, జిల్లా స్థాయి, మం డల, గ్రామ స్థాయిలలో నమోదు అయిన కే సుల పూర్తి వివరాలను వారం రోజులలోగా నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నివేదికల ద్వారా ఏ ప్రాంతం లో అయితే ఎక్కువ పోక్సో కేసు నమోదు అయ్యాయో ఆ ప్రాంతంలో అవగాహన సదస్సులు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు.

చైల్ హెల్ప్ లైన్ కు వచ్చే ఫిర్యాదుల ను జిల్లా, మండల,గ్రామ స్థాయిలో నమోదు చే యాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా చైల్ హెల్ప్ లైన్ అధికారులు ప్రతి నెల మొదటి వారంలో జిల్లాలోని అన్ని పా ఠశాలలు, హాస్టల్స్ ల హెడ్మాస్టర్లు, వార్డెన్ లకు ఫోన్ చేసి పాఠశాలలో ఎవరైనా లైంగిక వేధింపులకు గురి అయ్యారా, ఉపాధ్యాయు లు పిల్లలను కొట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారా అని అడిగి,విద్యార్థుల పూర్తి బాధ్యత హెడ్మాస్టర్ లది మరియు హాస్టల్ వార్డెన్ లదే అని స్పష్టం చేయాలన్నారు.

ఎవరైనా అటువంటి చర్యలకు పడితే కఠిన చర్య లు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం చైల్ హెల్ప్ లైన్ 1098 పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి జయలక్ష్మి , సిపిఓ సంజీవరావు, మహిళా శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లెనీనా, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా, ఐటీ కోర్ సిఐ రాము తదితరులు పాల్గొన్నారు.