calender_icon.png 5 December, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొబైల్‌కు బాల్యం బందీ

05-12-2025 12:08:56 AM

నేటి పిల్లలు చదవడానికి బాగా అలవాటు పడ్డారు అనడం కంటే మొబైల్‌కు బానిసల్లా మారుతున్నారని చెప్పొచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏడ్వకుండా, అల్లరి చేయకుండా ఉండడానికి మొబైల్‌ను చేతికి ఇస్తున్నారు. ఆ తర్వాత వాళ్లు వేరే వ్యాపకంలో పడిపోయి పిల్లలను పట్టించుకోకపోవడంతో గంటల తరబడి మొబైల్ ఫోన్లను చూస్తూ బానిసలుగా మారిపోతున్నారు. దీనివల్ల పిల్లలపై శారీరకంగా, మాన సికంగా ప్రతికూల ప్రభావం పడుతుంది.

కంటి చూపు దెబ్బతినడం, నిద్రలేమి, ఊబకాయం, మెదనొప్పులు వంటివి సమస్యలు పెరిగిపోతున్నాయని పరిశోధనలు చెబుతున్నారు. మొబైల్ వాడొద్దు అని పిల్లలకు చెప్పలేం కానీ పెద్దల పర్యవేక్షణలో దానిని ఉపయోగిస్తే అదొక విజ్ఞాన సాధనంగా ఉపయోగ పడుతుందని చెప్పొచ్చు. తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు మొబైల్ వాడకం తగ్గించుకోవాలి. పిల్లల్లో శారీరక కార్యకలాపాలను ప్రోత్సహించాలి.

మొబైల్‌కు బదులుగా ఆటలు, కథల పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం లాంటివి చేసేలా పిల్లలను ప్రోత్సహించాలి. పిల్లల జీవితంలో మొబైల్ ఒక ద్వంద్వ కత్తి లాంటిది. మొబైల్ ఫోన్.. ఒకవైపు విజ్ఞానాన్ని, మరోవైపు వివత్తును అందిస్తుంది. ఈ అలవాటును పూర్తిగా మాన్పించేలా చేయడం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. మొబైల్ ఫోన్లను బాధ్యతగా ఉపయోగించేలా పిల్లలను తీర్చిదిద్దడమనేది తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, సమాజ కర్తవ్యం. మొబైల్‌ను పిల్లలకు సేవకుడిగా ఉంచాలి. యజ మానిగా మారకుండా చూడాలి.

- సయ్యద్ అహ్మద్, హనుమకొండ