calender_icon.png 24 October, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రుల మృతి.. అనాథలుగా మారిన పిల్లలు

23-10-2025 07:18:43 PM

దాతలు ముందుకు వచ్చి అనాధ పిల్లలను ఆదుకోవాలి..

జిల్లా మంత్రి ఎంపీ ఎమ్మెల్యేలు సహకారం కోసం ఎదురుచూపులు..

తుంగతుర్తి (విజయక్రాంతి): వీధి నాటకంలో, నాలుగు సంవత్సరాల క్రితం తల్లి, నేడు తండ్రి మరణంతో వారి కుటుంబంలో తీవ్ర విచారాన్ని నింపింది. అమ్మానాన్నలిద్దరు కన్నుమూయడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో చోటు చేసుకుంది.స్థానిక గ్రామస్తుల కథనం ప్రకారం.. వెంపటి గ్రామానికి చెందిన బొజ్జ మహేష్(30), భార్య లావణ్య(24), వారి పిల్లలు వరుణ్(14), వర్షిత(6) ఉన్నారు. స్థానిక గ్రామంలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అలా సాఫీగా వారి జీవనం కొనసాగుతున్న తరుణంలో మహేష్ భార్య లావణ్య అనారోగ్యంతో బాధపడుతూ నాలుగు సంవత్సరాల క్రితం ఆమె మృతిచెందింది. మహేష్ కూడా అనారోగ్యంతో బాధపడుతూ.. భార్య మృతి చెందిన బాధతో మృతి చెందాడు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. దాతలు, ప్రభుత్వం, జిల్లా మంత్రి ఎంపీ ఎమ్మెల్యే చిన్నారులను అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు.