calender_icon.png 24 October, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

23-10-2025 07:21:10 PM

సింగిల్ విండో చైర్మన్ కపిల్ రెడ్డి

తాడ్వాయి (విజయక్రాంతి): ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మక్కలు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ కపిల్ రెడ్డి, ప్రత్యేక అధికారి లక్ష్మణ్ లు సూచించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం మక్కల కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం దళారుల నుంచి రక్షించడం కోసమే ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కేంద్రాలను సద్వినియం చేసుకొని లబ్ధి పొందాలని సూచించారు.

కొనుగోలు కేంద్రం ప్రారంభంలో కొద్దిసేపు రసాభాస నెలకొంది. కొబ్బరికాయ కొట్టే విషయంలో చైర్మన్, ప్రత్యేక అధికారికి  మధ్య వివాదం చెలరేగింది. కొబ్బరికాయ నేనే కొడతానని చైర్మన్ అంటే, మీకు అధికారం లేదని ఈ సొసైటీకి ప్రత్యేక అధికారిని నియమించారని నేను కొబ్బరికాయ  కొట్టాలని ప్రత్యేక అధికారి వాదించారు. అక్కడ ఉన్న ప్రతినిధులు కల్పించుకొని గొడవను సద్దుమణిగేటట్లు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ధర్మారెడ్డి, డైరెక్టర్లు సంజీవరెడ్డి, రాజిరెడ్డి,మాజీ వైఫ్ ఎంపీపీ నర్సింలు,  సిబ్బంది నర్సింలు, నితేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.