calender_icon.png 23 October, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమకొండలోని తేజస్వి హై స్కూల్లో విద్యార్థుల వరుస మరణాలు

23-10-2025 07:13:03 PM

స్కూల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన..

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండలోని నయీమ్ నగర్ లో ఉన్నటువంటి తేజస్వి హై స్కూల్లో విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గత 45 రోజుల కిందట పదవ తరగతి చదువుతున్న జయంతి వర్ధన్ విద్యార్థి ఆడుకుంటూ కింద పడి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోవడంతో భారీ ఎత్తున బంధువుల వచ్చి ఆందోళన చెప్పటారు. ఈ ఘటన మరువకముందే నాలుగవ తరగతి చదువుతున్న బానోతు సుజిత్ ప్రేమ్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లోనే కిందపడడంతో స్కూల్ యాజమాన్యం హాస్పిటల్ కి తీసుకెళ్లారు. 

డాక్టర్లు పరీక్షించి విద్యార్థికి బ్రెయిన్ డెడ్ కావడంతో చనిపోయాడని తెలిపారు. అయితే స్కూల్ ఎదుట విద్యార్థి యొక్క తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యమే మా పిల్లాడిని కొట్టి చంపారని, ఆరోగ్యంగా వున్నా అబ్బాయి ఏ విధంగా చనిపోయి ఉంటాడు అని, స్కూల్ వారే కొట్టి ఉంటారని అందువల్లే బాబుకి ఇలా అయిందని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.