24-10-2025 12:05:01 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, అక్టోబర్ 23(విజయక్రాంతి): దళారుల ప్రమేయం లేకుండా డబుల్ బెడ్ రూమ్ లా పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.గురువారం మహబూబ్ నగర్ గ్రామీణ మండలానికి చెందిన చౌదర్ పల్లి, మాచన్ పల్లి తాండా , ఫత్తేపూర్, ఓబ్లాయిపల్లి , కోడూరు, మాచన్ పల్లి గ్రామాలలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంజిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా 180 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఎమ్మెల్యే పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను ఒక్క శాతం కూడా కట్టించి పేదలకు ఇవ్వలేదని, పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఆశ చూపించి మోసం చేసిందని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తిగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, రూ 9 కోట్లు మంజూ రు చేయించి, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి, తాగునీరు, విద్యుత్ వంటి అవసరమైన మౌలిక వసతులు కల్పించామని గుర్తు చేశారు.
అ ర్హుల జాబితాలో ఎవరి ఒత్తిడి, ప్రమేయం లే కుండా అధికారులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చామని, దానితో లబ్దిదారులను గుర్తించడంలో , ఎంపిక చేయడంలో అధికారులు పూర్తి పారదర్శకంగా, రూల్స్ ప్రకారమే వ్యవహరించారని ఆయన అన్నారు . ప్రజా ప్రభుత్వం లో నిజమైన లబ్దిదారులకే న్యా యం జరుగుతుందని స్పష్టం చేశారు. డబు ల్ బెడ్రూం ఇండ్లు రానివాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని, ప్రతి పేదవాడికి సొంతింటి కళ నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని హా మీ ఇచ్చారు.
మొదటి ఫేజ్ లో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, రెండవ ఫేజ్ లో సైతం 3500 ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని, డబుల్ బెడ్రూం ఇండ్లు రాని లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆయన చె ప్పారు. ఈ సందర్భంగా డ్రా ద్వారా డబుల్ బెడ్రూం ఇండ్లు పొందిన లబ్దిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు న ర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బె క్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, శిక్షణా కలెక్టర్ క్రిస్టినా ఇవాంజిలీన్, హౌసింగ్ పిడి వైద్యం భాస్కర్, ఆర్డీఓ నవీన్, మహబూబ్ నగర్ గ్రామీణ మండల తహశీల్దార్ బి.శ్రీనివాసు లు, ఎంపిడిఓ కరుణశ్రీ, కాంగ్రెస్ పార్టీ నా యకులు సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, రాంచంద్రయ్య, పండరయ్య, గోవింద్ యా దవ్ , భాస్కర్ రెడ్డి, మైబు, తుప్పలి ఆంజనేయులు, భాస్కర్, నరేష్, రవింధర్, జి.ఆంజ నేయులు, తదితరులు పాల్గొన్నారు.