30-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్తు, బాల బాలికలలో తెలుగు భాష పట్ల అవగాహన, అనురాగం, స్వాభిమానం, బాధ్యత పెంపొందించాలనే లక్ష్యంతో ‘బాలల ప్రపంచ తెలు గు మహా సభలు 2026‘ నిర్వహించడానికి సంకల్పించింది. 16 ఏళ్ల లోపు బాల బాలికలలో మాతృభాషపై అవగాహన, ప్రేరణ, అ నురాగం, బాధ్యతను పెంపొందించేందుకు, తెలుగు భాషను ఒక స్వాభిమాన ప్రతీకగా వారు భావించేలా తీర్చిదిద్ది, ప్రతిభావంతులైన బాల బాలికలను గుర్తించి శాస్త్రీయ శిక్షణ అందించి, సంప్రదాయ కళలు , ఆధునిక సాంకేతికతల సమ్మేళనంగా తెలుగు వికాసాన్ని బాల బాలికల చేత ప్రదర్శింప జేయడమే ధ్యేయంగా ఈ ఏడాది డిసెంబరు 5, 6 తేదీల్లో బాలల ప్రపంచ తెలుగు మహా సభలు నెక్స్‌ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణం, ఒంగోలులో నిర్వహిస్తామని, షుమారు 50 దేశాల నుండి బాల బాలికలు పాల్గొంటారని డా.గజల్ శ్రీనివాస్, అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలిపారు.
నెక్ట్స్‌జన్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ‘బాలలే మాతృ భాషకు భవిత‘ సదస్సుకు హాజరైన ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బాలల ప్రపంచ మహా సభల లోగోను ఆవిష్కరించారు. వే లాది మంది బాల బాలికలు ఆ మహా సభలలో పాల్గొని, వివిధ అంశాలపై ప్రదర్శనలు ఇచ్చేలా ప్రోత్సహించడం అభినందనీయమని డా.గజల్ శ్రీనివాస్‌ను మంత్రి ప్రశం సించారు.
డా.కె.మురళీధర్‌రెడ్డి, కోగంటి శ్రీకాంత్‌లకు సభల ముఖ్య సమన్వయకర్తలుగా నియమిస్తూ నియామక పత్రాలను సత్యకుమార్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డీ పట్టాభిరామ్, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజుబాబు, పరిషత్ సభ్యులు అడ్డాల వాసు, లఖంరాజు సునీత పాల్గొన్నారు.