09-07-2025 01:02:52 AM
- ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు సహకారంపై చైనా క్లారిటీ
న్యూఢిల్లీ, జూలై 8: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సహకారం అందించిందని భారత ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాలపై చైనాకు ప్రశ్నలు ఎదురయ్యాయి. చైనా ఫ్రెండ్లీ దేశాలని, కాబట్టి రక్షణ, భద్రతా రంగాల్లో సహకారం చాలా సాధారణమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు.
సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పాక్‌కు సహాయమందించిన విషయంలో తనకు స్ప ష్టత లేదని, అయితే పాక్‌కు తమ సహకారం ఏ దేశానికీ వ్యతిరేకంగా జరగలేదంటూ త ప్పించుకొనే ప్రయత్నం చే శా రు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భా ర త్, పాక్ మధ్య పరిస్థితులనూ చైనా చాలా జాగ్రత్తగా పరిశీలించిందని, ఇరుదేశాలు చ ర్చలు జరపాలని కోరిందని, ప్రాదేశిక శాంతి కోసం బీజింగ్ ప్రయత్నించిందని నింగ్ వెల్లడించారు. ఈ రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు మధ్యవర్తిత్వం వహించేందుకు చై నా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో భారత్ సంబంధాలు సైతం కీలక దశలో ఉన్నాయని తెలిపారు.