calender_icon.png 9 July, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతరిక్షంలోకి 166 మంది అస్థికలు

09-07-2025 01:01:08 AM

విషాదాంతమైన వినూత్న ప్రయోగం

న్యూఢిల్లీ, జూలై 8: తమకు ప్రియమైన వారి జ్ఞాపకాలను  పదిలంగా ఉంచుకోవాలని కొన్ని కుటుంబాలు ఎంచుకున్న వినూత్న ప్రయత్నం విషాదాంతమైంది. అంతరిక్షంలోకి అస్థికలను తీసుకెళ్లాలని చేసిన ప్రయోగం విఫలమైంది. సంకేతిక లోపంతో స్పేస్ క్యాప్సుల్ సముద్రంలో కుప్పకూలగా, అందులో ఉన్న 166 మంది అవశేషాలు సముద్రగర్భంలో కలిశాయి. జర్మనీకి చెందిన ది ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ మిషన్ ఇంపాజిబుల్ పేరుతో ఈ ప్ర యోగాన్ని నిర్వహించింది.

ఎన్‌వైఎక్స్ క్యాప్సుల్‌ను అభివృద్ధి చేసి జూన్ 23న నింగిలోకి ప్ర యోగించింది. ఇందులో ప్ర పంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన 166 మంది అస్థికలు, డీఎన్‌ఏ నమూనాలను భూ దిగువ కక్ష్యలోకి పంపించింది. టెక్సాస్‌కు చె ందిన స్పేస్ బరియల్ కంపెనీ సెలెస్టిస్‌తో క లిసి జర్మనీ సంస్థ దీన్ని చేపట్టింది.

ఈ క్యా ప్సుల్ భూమిని చుట్టి తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించి సురక్షితంగా కిందకు దిగాల్సి ఉంది. ఈ క్యాప్సుల్ భూమికి తిరిగి వచ్చే సమయంలో అనుకోకుండా ప్రయోగ కేంద్రంతో సంబంధాలు కోల్పోయింది. కొద్ది క్షణాలకే క్యాప్సుల్ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోవడం గమనార్హం.