calender_icon.png 24 December, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాఘ మాస జాతర ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ ఆది సమీక్ష

24-12-2025 01:33:22 AM

వేములవాడ, డిసెంబర్ 23,(విజయ క్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దత్తత ఆలయమైన మామిడిపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో జరగనున్న మా ఘ మాస జాతర ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముం దస్తుగా మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్ర త్యేక పూజలు నిర్వహించారు.

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు, త్రాగునీరు, క్యూలైన్లు, పా ర్కింగ్, రవాణా, వైద్య సేవలు, విద్యుత్ లై ట్లు, భద్రతా చర్యలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అ లాగే ఆలయ ప్రాంగణంలో నూతన కళ్యాణ మండపం, వంటశాల, 10 వేల లీటర్ల నీటి ట్యాంకు నిర్మాణాలు చేపడతామని తెలిపా రు. ఈ సమీక్షలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.