23-12-2025 12:00:00 AM
నిజామాబాద్ డిసెంబర్ 22 (విజయక్రాంతి) : ప్రేమ, శాంతి, కరుణ, జాలి, దయ, మరొకరికి సహాయం చెయ్యడం, సోదరభావాన్ని పెంపొందించడం వల్ల యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా ప్రార్ధించడం జరుగుతోందని జిల్లా సంక్షేమాధికారిని తో పాటు ఫాస్టర్ రెవరెండ్ ఆరోన్, వక్తలు కొనియాడారు. క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని స్నేహ సొసైటీ దివ్యంగుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో వారు ప్రసంగించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యంగుల పాఠశాలల్లో క్రిస్మస్ పండుగ, ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకోని ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వేడుకల్లోభాగంగా పశువుల పాక, క్రిస్మస్ చెట్టు, అలంకరణ విద్యార్థిని, విద్యార్థులు యేసు ప్రభు, మరియమ్మ, గొల్లలు, గొర్ల కాపరులు లాంటి విభిన్న వేషధారణలో అందంగా ముస్తాబై ఏసుప్రభు జననం, ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతం సంబంధించి నాటక ప్రదర్శన ద్వారా తెలియపరిచారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, సిఎస్‌ఐ చర్చ్ పాస్టర్ రెవరెండ్ ఆరోన్, క్రిస్టియన్ సోదరులు హాజరై ప్రార్థన ద్వారా, ఏసుక్రీస్తు జననం సంబంధించి క్లుప్తంగా వివరించారు...ప్రేమ, శాంతి, ఆనందాన్ని పరోపకారికి సహాయం చేయడం లాంటి విషయాలపై క్లుప్తంగా వివరించారు.. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.